ఐఫోన్-7 ఆఫర్ చేస్తున్న యంగ్ హీరోలు !


యంగ్ హీరోలు సందీప్ కిషన్, నారా రోహిత్, సుధీర్ బాబు, ఆది లు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘శమంతకమణి’. కొద్దిరోజుల క్రితమే మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర టీమ్ తర్వాత ఒక్కొక్క హీరో యొక్క ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూ అందరిలోనూ క్యూరియేసిటీని పెంచేసింది. అంతేగాకా సినిమాను ఇంకాస్త బేటర్ గా జనాల్లోకి తీసుకెళ్లేందుకు సరికొత్త రీతిలో ప్రమోషన్లను చేపడుతోంది.

కొద్దిసేపటి క్రితమే సినిమా యొక్క టీజర్ తేదీని సరిగ్గా ఊహించగలిగితే హీరోల చేతుల మీదుగా ఐ ఫోన్-7 అందుకోవచ్చనే కొత్త కాంటెస్ట్ ను అనౌన్స్ చేసింది చిత్ర టీమ్. అంతేగాక సరైన సమాధానం కనిపెట్టడానికి ఆరు ప్రశ్నల ద్వారా క్లూస్ కూడా ఇచ్చింది. వీటన్నింటికీ సరిగ్గా జవాబులు కనుక్కోగలిగితే టీజర్ లాంచ్ డేట్ తెలుస్తుందని తెలిపింది. దీంతో సోషల్ మీడియా యూజర్లంతా లాంచ్ డేట్ కనుక్కునే పనిలో పడ్డారు. ‘భలే మంచి రోజు’ ఫేమ్ శ్రీరామ్ అదిత్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.