ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన మిస్టకల్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల’ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ప్రమోషనల్ కంటెంట్‌తోనే భారీ అంచనాలు పెంచేసిన ఈ చిత్రం, డిసెంబర్ 25న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే, ఈ సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో మేకర్స్ ఒక రోజు ముందే.. అంటే డిసెంబర్ 24న ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు.
ప్రీమియర్లకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది సేపటికే టికెట్స్ అమ్ముడయిపోయాయి. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ కారణంగా ఈ మూవీకి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోందని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, టీజర్ మరియు ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్సే దీనికి నిదర్శనమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే అన్ని రకాల హక్కులు (థియేట్రికల్ & డిజిటల్) భారీ ధరలకు అమ్ముడయ్యాయి. దీంతో నిర్మాతలు ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్స్‌లో ఉండటం విశేషం.
