శంబళ.. “కల్కి” ఫైనల్ ట్రైలర్ పైనే అందరి కళ్ళు

శంబళ.. “కల్కి” ఫైనల్ ట్రైలర్ పైనే అందరి కళ్ళు

Published on Jun 21, 2024 11:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దీపికా పడుకోణ్ మరో ముఖ్య పాత్రలో ఇంకా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ నటులు నటిస్తున్న అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ “కల్కి 2898 ఎడి” ఫీవర్ ఇప్పుడు కొనసాగుతుంది. ఇండియన్ సినిమా నుంచి మరో గేమ్ ఛేంజింగ్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా నుంచి నేడు మరో ట్రైలర్ ని మేకర్స్ అందిస్తున్నట్టుగా రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే వచ్చిన అఫీషియల్ ట్రైలర్ కాకుండా మరో రెండు లీక్ అయ్యాయి. వీటితో అంచనాలు మరింత పెట్టుకున్నారు. మరి లేటెస్ట్ గా ఇచ్చిన ఓ కొత్త పోస్టర్ కూడా మరింత ఆసక్తి రేపుతోంది. శంబళ ఇంటి కోసం ఎదురు చూస్తుంది అని క్రేజీ విజువల్ కూడా ఒకటి చూపించారు.

ఇక మరో పక్క ఈ సాయంత్రం 6 గంటలకి వచ్చే ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనే అందరి కళ్ళు ఎదురు చూస్తున్నాయి. మరి ఈ ట్రైలర్ ఏ రేంజ్ ట్రీట్ ని అందిస్తుందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు