చరణ్, శంకర్ ల భారీ ప్రాజెక్ట్ మొదలు అక్కడ నుంచే.?

Published on Sep 17, 2021 2:25 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గానే ఇండియన్ జేమ్స్ కేమెరూన్ శంకర్ తో ఓ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్న షురూ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఈ చిత్రం అనౌన్సమెంట్ కి ఎంతైతే హైప్ వచ్చిందో మొన్న ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం అలాగే పోస్టర్ కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ చిత్రం మొన్న ముహూర్తం కంప్లీట్ చేసుకోగా షూట్ ఎప్పుడు నుంచి ఎక్కడ నుంచి మొదలు కానుందా అన్నది మరింత ఆసక్తిగా మారింది. అయితే ఈ చిత్రం లేటెస్ట్ బజ్ ప్రకారం షూట్ పూణే నుంచి స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా క్లారిటీ లేదు కానీ ప్రస్తుతానికి అయితే టాక్ ఇలా ఉంది.

ఇక ఈ భారీ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే శంకర్ చరణ్ ల కెరీర్ లో బెంచ్ మార్క్ 15వ సినిమా అయినటువంటి దీనిని నిర్మాత దిల్ రాజు తమ బ్యానర్ నుంచి 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :