చరణ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆల్బమ్ పై శంకర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

Published on Sep 10, 2021 8:02 am IST


లేటెస్ట్ గా మరో పాన్ ఇండియన్ భారీ చిత్రం మెగాపవర్ స్టార్ మరియు రామ్ చరణ్ ల కలయికలో ప్లాన్ చేసిన బెంచ్ మార్క్ సినిమా షురూ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు అనౌన్సమెంట్ టైం లో ఎలాంటి హైప్ ఈ సినిమాకి వచ్చిందో మళ్ళీ ఈ కొన్ని రోజులు ఈ ట్రాన్స్ కొనసాగింది. మరి చాలా గ్రాండ్ గానే జరిగిన ఈ చిత్రం పూజా కార్యక్రమంకి పలువురు బడా స్టార్స్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

అయితే మరి ఈ కార్యక్రమం అయ్యాక శంకర్ ఒక్కొక్కరిని ఉద్దేశించి తన ట్విట్టర్ లో పలు పోస్ట్స్ పెట్టారు. మరి వీటిలో ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ పై కూడా ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఈ సినిమా ఆల్బమ్ పై పెట్టారు. ఇప్పటికే మనం రికార్డ్ చేసిన ఫస్ట్ సాంగ్ అదిరే లెవెల్లో వచ్చింది.

అలాగే మిగతా సాంగ్స్ కూడా ఖచ్చితంగా అంతే లెవెల్లో వస్తాయి అంతే కాకుండా ప్రతి ఒక్కరి హృదయాలను మెదిలిస్తాయని అనుకుంటున్నాని శంకర్ తెలిపారు. దీనిని బట్టి ఈ సినిమా ఆల్బమ్ ఆల్రెడీ స్యూర్ షాట్ హిట్ అని అర్ధమయ్యిపొయింది.. మామూలుగానే శంకర్ అన్ని సినిమాల ఆడియో పెద్ద హిట్టవుతాయి మరి ఈ సినిమా విషయంలో కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు ఇదెలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :