శంకర్ మార్క్ లో చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ ప్లాన్..డీటెయిల్స్ ఇవే.!

Published on May 22, 2022 1:00 pm IST


ఇటీవల కాలంలో జస్ట్ అనౌన్సమెంట్ తోనే భారీ హైప్ ని ఇచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ లు చాలా తక్కువ ఉన్నాయని చెప్పాలి. మరి అలా ఒక్కసారిగా భారీ హై ని ఇచ్చిన ప్రాజెక్ట్ ఇండియన్ టాప్ దర్శకుల్లో ఒకరైన శంకర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల సినిమా అని చెప్పాలి.

ఈ ఇద్దరి దిగ్గజాల కెరీర్ లో 15వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇండియన్ సినిమా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. మరి ఈ డీటెయిల్స్ లోకి వెళితే జస్ట్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కోసమే శంకర్ మార్క్ లో ఒక క్రేజీ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట.

దీనితో ఈ సినిమాని కూడా శంకర్ తనదైన స్టైల్ లోనే తీసుకెళ్తున్నారని చెప్పాలి. అలాగే ఈ ఈవెంట్ ఫస్ట్ లుక్ లాంచ్ ఆగస్ట్ లోనే కన్ఫర్మ్ అని తెలుస్తుంది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్లాన్ చేస్తున్నారట.

మరి జస్ట్ ఫస్ట్ లుక్ కోసమే ఈవెంట్ అంటే ఇక రిలీజ్ నాటికి శంకర్ ఈ సినిమాకి ఏ లెవెల్ ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా నిర్మాత దిల్ రాజు తమ బ్యానర్ లో బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :