మిస్టర్ బాక్సాఫీస్ తో స్టన్నింగ్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన శంకర్..?

Published on Sep 22, 2021 9:00 am IST


మిస్టర్ బాక్సాఫీస్ రామ్ చరణ్ కెరీర్ గ్రాఫ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఒక లెక్కలో పెరుగుతూ వెళ్తుంది.. తన లేటెస్ట్ చిత్రం “RRR” తో ఆల్రెడీ అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఒక మార్క్ ని సెట్ చేసిన మెగాపవర్ స్టార్ ఇప్పుడు మరో పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ తో సినిమా సెట్ చేసి విపరీతమైన హైప్ ని తెచ్చుకున్నాడు. శంకర్ సినిమాలు అంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తాను తీసుకున్న ఏ సబ్జెక్ట్ అయినా కూడా భారీ లెవెల్లో ప్లాన్ చేస్తారు. కంటెంట్, యాక్షన్, సాంగ్స్ అన్నీ కూడా మరో స్థాయిలో కనిపిస్తాయి మరి సరిగ్గా ఇప్పుడు చరణ్ తో ప్రాజెక్ట్ లో ఓ స్టన్నింగ్ సీక్వెన్స్ ని శంకర్ ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఏకంగా 10 కోట్లతో ఓ భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేస్తున్నారట.

ఇది సినిమాలో ఓ ఖచ్చితమైన భారీ హైలైట్ గా నిలుస్తుంది అని తెలుస్తుంది. మరి ఈ టాక్ లో ఎంతమేర నిజముందో చూడాలి. ఇది వరకే శంకర్ రోబో సినిమాలో ఓ ట్రైన్ సీక్వెన్స్ పెట్టి ట్రెండ్ సెట్ చేశారు. మరి ఇందులో ఏ లెవెల్లో ఉంటుందో ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :