ఓ అవుట్ స్టాండింగ్ సాంగ్ ని ప్లాన్ చేసిన శంకర్.?

Published on Oct 26, 2021 5:18 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఐకానిక్ దర్శకుడు శంకర్ ల కాంబోలో తమ కెరీర్ బెంచ్ మార్క్ సినిమా 15వ ప్రాజెక్ట్ ఇప్పుడు తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకొని ఉన్న ఈ చిత్రంపై ఇపుడు మరిన్ని ఆసక్తికర అంశాలే వినిపిస్తున్నాయి. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం పూణేలో షూట్ స్టార్ట్ చెయ్యగా హైదరాబాద్ షూట్ లో మాత్రం శంకర్ ఒక అవుట్ స్టాండింగ్ సాంగ్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

నార్మల్ గానే శంకర్ సినిమాల్లో పాటలకు పెట్టే బడ్జెట్ తో ఒక మీడియం సినిమా తీసేయొచ్చు. అలానే ఈ సినిమాలో కూడా ఫస్ట్ ప్లాన్ చేసిన సాంగ్ చాలా బాగుంటుందట. అలాగే సినిమా కాన్సెప్ట్ పరంగా ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. దీని కోసం కూడా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని కూడా బజ్ ఉంది. ఇక ఈ భారీ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దిల్ రాజు తన బ్యానర్ నుంచి 50వ సినిమాగా ప్రిస్టేజియస్ లా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More