RC 15 కోసం భారీ సాంగ్ ప్లాన్ చేస్తున్న శంకర్ ..?

RC 15 కోసం భారీ సాంగ్ ప్లాన్ చేస్తున్న శంకర్ ..?

Published on Oct 23, 2022 9:36 AM IST

రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక భారీ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ని నవంబర్ రెండవ వారంలో ప్రారంభించనుండగా ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్ ని ఎంతో గ్రాండియర్ లెవెల్లో ప్లాన్ చేస్తున్న శంకర్, అందుకోసం పలు ఫారిన్ లొకేషన్స్ ని ఎంపిక చేశారట. భారీ బడ్జెట్ తో యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు