మిస్టర్ బాక్సాఫీస్ కి తగ్గ నెవర్ బిఫోర్ యాక్షన్ ప్లాన్ చేస్తున్న శంకర్?

Published on Nov 21, 2021 11:00 am IST

టాలీవుడ్ మిస్టర్ బాక్సాఫీస్ ఇప్పుడు తన సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ గా మారే ప్రయత్నంలో ఇప్పుడు ఉన్నాడు. ఐకానిక్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాతో ఈ ప్రయాణం మొదలు కాబోతుంది. అయితే సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి కూడా భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని మేకర్స్ ఇప్పుడు రెండో షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేశారు.

అయితే నిన్నటి నుంచి మాత్రం ఓ సాలిడ్ టాక్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో శంకర్ చరణ్ తో తన ఇప్పుడున్న అదిరే పర్సనాలిటీకి తగ్గట్టుగా నెవర్ బిఫోర్ ఫైట్స్ ని ప్లాన్ చేస్తున్నారట. అందులోని ఫైటర్స్ అంటూ కొన్ని ఫోటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి కానీ అందులో నిజముంటే మాత్రం వీరి బెంచ్ మార్క్ 15వ సినిమాలో యాక్షన్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం కన్ఫర్మ్ అని చెప్పాలి.

ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ లో 50వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :