“గేమ్ ఛేంజర్” పక్కా మాస్ చిత్రం – శంకర్ సాలిడ్ స్టేట్మెంట్

“గేమ్ ఛేంజర్” పక్కా మాస్ చిత్రం – శంకర్ సాలిడ్ స్టేట్మెంట్

Published on Jul 11, 2024 8:08 AM IST


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా కియారా అద్వానీ (Kiara Advani) అలాగే అంజలి లు హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రమే “గేమ్ ఛేంజర్”. మరి ఈ సినిమా శంకర్ నుంచి స్ట్రైట్ సినిమా కావడంతో గట్టి అంచనాలు నెలకొన్నాయి. ఇక అందుకు తగ్గట్టుగానే శంకర్ తన మార్క్ గ్రాండియర్ తో భారీ లెవెల్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తుండగా రీసెంట్ గా అయితే ఈ సినిమా పై కొంచెం క్లారిటీ కూడా అందించారు.

ఇక దీనితో పాటుగా ఇప్పుడు ఈ సినిమాపై చేసిన మరిన్ని సాలిడ్ కామెంట్స్ అయితే ఇప్పుడు వైరల్ గా మారాయి. తాను తెలుగులో స్ట్రైట్ సినిమా ఎప్పుడు నుంచో చెయ్యాలి అనుకుంటున్నాను అని గతంలో రెండు మూడు సార్లు అనుకున్నాను కానీ కుదరలేదు. ఈసారి తెలుగు ఆడియెన్స్ ఎలాంటి మాస్ సినిమా కావాలో అన్ని హంగులతో కలిపి గేమ్ ఛేంజర్ ని సిద్ధం చేస్తున్నానని తెలిపారు.

ఇదొక ఒక్కా మాస్ చిత్రం అని కార్తీక్ సుబ్బరాజ్ నుంచి లైన్ తీసుకొని పూర్తిగా తెలుగు ఆడియెన్స్ ని మెప్పించే విధంగా ఒక స్ట్రైట్ సినిమాగా రూపొందించామని తెలిపారు. మరి శంకర్ నుంచే సినిమా కోసం ఇంత కాన్ఫిడెంట్ స్టేట్మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు