కమల్ క్యారెక్టర్ పై శంకర్ క్రేజీ కామెంట్స్

కమల్ క్యారెక్టర్ పై శంకర్ క్రేజీ కామెంట్స్

Published on Jul 7, 2024 11:10 PM IST

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు-2’. జూలై 12, 2024న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఐతే, హైదరాబాద్ లో నిర్వహించిన భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శంకర్ మాట్లాడుతూ.. ‘సేనాపతి క్యారెక్టర్ డిజైన్ చేయడం కోసం… కమల్ గారి ఫ్రంట్ పిక్చర్, ప్రొఫైల్ పిక్చర్… వాళ్ల నాన్న గారి ఫ్రంట్ పిక్చర్, ప్రొఫైల్ పిక్చర్… వాళ్ల ఇద్దరి బ్రదర్స్ ఫ్రంట్ పిక్చర్, ప్రొఫైల్ పిక్చర్ తీసి ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారికి ఇచ్చాం. దాంతో ఆయన వీటన్నింటి నుంచి ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి ఇచ్చారు. అదే ఈ సినిమాలో సేనాపతి క్యారెక్టర్. ఆ స్కెచ్ చూసిన వెంటనే నాకు గూస్ బంప్స్ వచ్చాయి’ అంటూ శంకర్ చెప్పుకొచ్చాడు.

శంకర్ ఇంకా మాట్లాడుతూ… ‘మా సెట్ లో భారతీయుడు ఇక్కడే తిరుగుతున్నాడన్న ఓ రెస్పెక్ట్ తో కూడిన భయం మాకు ఉండేది. ఇక కమల్ సర్ నటన చూస్తే ఇంతకంటే ఇంకెవరూ పెర్ఫామ్ చేయలేరు. ఇక సిద్ధార్థ్ ను సినీ రంగానికి పరిచయం చేసింది నేనే. తొలి సినిమా చేసేటప్పుడే 10 సినిమాలు చేసిన అనుభవం ఉన్న వాడిలా నటించాడు. ఇప్పుడు భారతీయుడు-2 సినిమాలో 100 సినిమాలు చేసిన అనుభవం ఉన్న వాడిలా నటించాడు’ అంటూ శంకర్ తెలిపాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు