‘రోబో-2’ పాట కోసం నిజంగా అంత ఖర్చు పెట్టారా ?


దక్షిణాది సీనీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం రజనీ ‘రోబో-2’. రజనీ – శంకర్ ల ‘రోబో’ కు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేసిన టీమ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఒక పాటను శంకర్ చాలా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారనేది ఇంతకుముందే తెలిసిన విషయం.

అయితే ఈ పాటకు అయిన ఖర్చు ఎంతనే సంగతి మాత్రం ఇప్పటికీ అధికారికంగా బయటకురాలేదు. కానీ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ పాట కోసం శంకర్ అక్షరాలా రూ.30 కోట్లు వెచ్చించారని టాక్. సాధారణంగానే పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రాండ్ గా రూపొందించే శంకర్ ఇంత మొత్తం ఖర్చుచేశారంటే కొంత నమ్మశక్యంగానే ఉన్నప్పటికీ అధికారిక సమాచారం వెలువడే వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ సినిమాను 2018 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.