చరణ్ సినిమా కోసం శంకర్ మరిన్ని జాగ్రత్తలు.?

Published on Jul 1, 2022 2:00 am IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా టాప్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు శంకర్ అలాగే చరణ్ ల కెరీర్ లో ఈ చిత్రం 15వ సినిమా కాగా దీనిపై అందరిలో మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రాన్ని కూడా శంకర్ మార్క్ లో అదిరే సోషల్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో కావాల్సిన భారీ ప్లానింగ్స్ తోనే తెరకెక్కిస్తుంగా మేకర్స్ బ్యాలన్స్ షూట్ ని ఇండియాలో పలు చోట్ల శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

అయితే జెనరల్ గా శంకర్ సినిమాలు అంటే చాలా కేర్ గా తీస్తారు అని తెలిసిందే. సినిమా పూర్తయ్యే వరకు కూడా తాను ఎలాంటి లైన్ చేస్తున్నారో కూడా రివీల్ చేయరు. అయితే ఈ సినిమాకి కూడా శంకర్ చాలా జాగ్రత్తలు ఇప్పుడు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

రానున్న రోజుల్లో కొన్ని కీలక షెడ్యూల్స్ ని మాత్రం శంకర్ చాలా టైట్ సెక్యూరిటీతో ప్లాన్ చేస్తున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇందులో కొన్ని సన్నివేశాలు సహా నటీనటుల లుక్స్ కూడా చాలా కీలకం కాబట్టి ఈ షెడ్యూల్స్ శంకర్ పకట్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మరి దీనిపై అయితే మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :