‘బాలీవుడ్ స్టార్ హీరో’తో శంకర్ ?

Shankar

కమల్‌ హాసన్ – శంకర్‌ కలయికలో భారతీయుడు సీక్వెల్‌ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ ను తీయాలనుకుంటున్నాడట శంకర్.

దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా శంకర్ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి టెక్ మాంత్రికుడు భారీ హంగులతో ఈ సినిమాని కూడా తీర్చిదిద్దుతున్నారు.

ఇక ప్రస్తుతం భారతీయుడు సీక్వెల్‌ కొన్ని కారణాల వల్ల షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Exit mobile version