డిజాస్టర్ టాక్ ని బ్రేక్ చేసిన శంకర్ ‘ఐ’

shankar-i

ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద భారీ విడుదలవుతుంటాయి. కానీ కొన్ని సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా స్టార్ పవర్ వల్ల కలెక్షన్స్ మాత్రం అదిరిపోతాయి. ఇదే ఫార్ములాని తాజాగా విడుదలైన శంకర్ సినిమా మరోసారి నిరూపించింది. శంకర్ డైరెక్షన్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా ‘ఐ’. ఈ సినిమాకి ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ మరియు నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

ఈ సినిమా మొదటి రోజు సుమారు 7 కోట్లకి పైగా షేర్ కలెక్ట్ చేసిందని తెలియజేశాము. రెండవ రోజు కూడా ఇదే జోరును కొనసాగించింది. మొదటి రెండు రోజుల్లోనే భారీగా కలెక్ట్ చేసిన అమౌంట్ తో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వారు పెట్టిన అమౌంట్ ని రాబట్టుకునే పనిలో ఉన్నారు. సంక్రాంతి సీజన్ వల్ల మొదటి రెండు రోజులు బాగానే ఉన్నా ఈ రోజు నుంచి కలెక్షన్స్ పడే చాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఒక డబ్బింగ్ సినిమాకి మొదటి రెండు రోజుల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం కూడా ఇదే ప్రధమం. దీనికి కారణం శంకర్ కి బాక్స్ ఆఫీసు వద్ద స్టామినా అని చెప్పడంలో ఎలాంటి అనుమానమూ లేదు.

Exit mobile version