ఇండియన్ ఐడల్ షణ్ముఖ ప్రియకి అవకాశం ఇచ్చిన విజయ్ దేవరకొండ!

Published on Sep 6, 2021 10:26 pm IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం లైగర్, సాలా క్రాస్ బ్రీడ్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల ఇండియన్ ఐడల్ గా నిలిచిన షణ్ముఖ ప్రియ కి నటుడు విజయ్ దేవరకొండ అవకాశం ఇచ్చారు. లైగర్ లో పాడేందుకు అవకాశం కల్పించడం జరిగింది. అయితే తాజాగా షణ్ముఖ ప్రియను విజయ్ దేవరకొండ కలవడం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

విజయ్ దేవరకొండ కి వీరాభిమాని అయిన షణ్ముఖ, విజయ్ ను కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. లవ్ అండ్ సపోర్ట్ గా నిలిచినందుకు థాంక్స్ తెలిపింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ చిత్రం పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో విజయ్ సరసన హీరోయిన్ గా బాలివుడ్ భామ అనన్య పాండే నటిస్తుంది.

సంబంధిత సమాచారం :