దీప్తితో బ్రేకప్‌పై స్పందించిన షణ్ముఖ్.. ఏమన్నాడంటే?

Published on Jan 1, 2022 6:54 pm IST

బిగ్‌బాస్ సీజన్ 5 రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్‌తో బ్రేకప్ అవుతున్నట్టు చెప్పేసింది దీప్తి సునయన. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ న్యూ ఇయర్ రోజున వీరిద్దరు విడిపోతున్నట్టు దీప్తి ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. తమ ఐదేళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నామని, ఎంతో ఆలోచించి, మేమిద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇద్దరం కలిసి ఉండటానికి ఎంతో ప్రయత్నించాం, కానీ జీవితానికి ఏది అవసరమో వాటిని విస్మరించామని, మా ఇద్దరి దారులు వేరని తెలుసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని దీప్తి చెప్పుకొచ్చింది.

అయితే దీప్తితో బ్రేకప్‌పై షణ్ముఖ్ కూడా స్పందించాడు. బ్రేకప్ నిర్ణయం తీసుకోవడానికి దీప్తికి అన్ని హక్కులు ఉన్నాయని, ఇప్పటివరకూ తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని, ఇప్పటికైన ఆమె ఆనందంగా ఉండాలనుకుంటున్నానని, మా దారులు వేరైనా ఒకరికొకరం సపోర్ట్‌ చేసుకుంటూనే ఉంటామని, నేను బెటర్ పర్సన్ అయ్యేందుకు ఈ 5 సంవత్సరాలు నువ్వు అందించిన సహాయానికి ధన్యవాదాలు అని, నువ్వు సంతోషంగా ఉండాలి.. ఆల్‌ ది బెస్ట్‌ దీపు అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు.

ఇదిలా ఉంటే దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్‌కి బిగ్‌బాస్ షోనే కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సిరితో షణ్ముఖ్ క్లోజ్‌గా ఉండటం దీప్తికి నచ్చలేదని అందుకే షన్నుతో బ్రేకప్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :