బిగ్ బాస్ 5 : షన్ను క్రేజ్ మిలియన్ కి పైగా..!

Published on Dec 5, 2021 11:00 am IST

ఇప్పుడు మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై గ్రాండ్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ షో సీజన్ 5 రసవత్తరంగా ఫైనల్స్ కి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వారం కూడా అయ్యిపోతే ఇంకో రెండు వారాల్లో షో కంప్లీట్ అయ్యిపోనుంది, విన్నర్ ఎవరో కూడా ఒక క్లారిటీ వస్తుంది.

అయితే ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో ఒక్కో కంటెస్టెంట్స్ కి సెపరేట్ క్రేజ్ ఉంది. అయితే ఆల్రెడీ సాలిడ్ క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్ మాత్రం యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ అని చెప్పాలి. ఇప్పుడు షన్ను క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో సోషల్ మీడియాలో క్లారిటీ వచ్చింది.

ఏకంగా తనపై ట్యాగ్ తో మిలియన్ కి పైగా ట్వీట్స్ పడి ఇండియన్ వైడ్ ట్రెండ్స్ లో నిలిచింది. అయితే ఈసారి సీజన్లో ఓ కంటెస్టెంట్ కి మిలియన్ కి పైగా ట్వీట్స్ తో ట్రెండ్ అవ్వడం అనేది షన్ను ఒక్కడికే జరిగింది అని చెప్పాలి. దీనిని బట్టి షన్ను కి ఎంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :