శ‌రణ్ కుమార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..!

శ‌రణ్ కుమార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..!

Published on Sep 5, 2021 1:26 AM IST

సూపర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మల ఫ్యామిలీ నుంచి శ‌రణ్ కుమార్ హీరోగా ప‌రిచయం అవుతున్న సంగ‌తి తెలిసిందే. శివ కేశ‌ర కుర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ఎం.సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌ర‌ణ్ కుమార్ పుట్టిన‌రోజు ఈ సంర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది.

ఈ గ్లింప్స్ చాలా డిఫ‌రెంట్‌గా అనిపిస్తుంది. ఆవిరి ప‌ట్టిన అద్దాన్ని తుడిస్తే అందులో హీరో శ‌ర‌ణ్ కుమార్ ముఖం క‌నిపిస్తుంది. అయితే ఇప్ప‌టికే సూప‌ర్‌స్టార్ కృష్ణ హీరో లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయగా దానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎం.సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ హీరో శరణ్‌ కుమార్‌గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌డం హ్య‌పీగా ఉందని అన్నారు. సూప‌ర్‌స్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శ‌ర‌ణ్‌కు ఈ సినిమా ఖచ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుందని అనుకుంటున్నామని, ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోందని, త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని విష‌యాలు తెలిసే అవకాశం ఉంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు