చాలా రోజుల తర్వాత చేసిన సినిమా చాలా గొప్పగా వచ్చిందన్న శరత్ కుమార్ !

15th, March 2017 - 03:52:58 PM


గత కొన్నాళ్లుగా కెరీర్లో సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న హీరో సాయి రామ్ శంకర్ చేసిన తాజా చిత్రం ‘నేనో రకం’. నూతన దర్శకుడు సుదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 17న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ ‘చాలా రోజుల తరవాత ఈ చిత్రం ద్వారా నాకో మంచి హిట్ వస్తుందని నమ్ముతున్నాను. చాలా కష్టపడి చేశాం. మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మెసేజ్ కూడా ఉన్న సినిమా. కుటుంబం మొత్తం కలిసి చూడదగిన సినిమా. అందరికీ తప్పక నచ్చుతుందని అనుకుంటున్నాను’ అన్నారు.

అలాగే మరొక చిత్రంలో మరో ప్రధాన పాత్ర చేసిన తమిళ సీనియర్ స్టార్ నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ ‘చాలా రోజుల తెలుగులో డైరెక్ట్ సినిమా చేశాను. చిత్రం చాలా గొప్పగా వచ్చింది. సన్నివేశాల్లో సీరియస్ నెస్ తీసుకురావడానికి నా పాత్రకు నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాను. ప్రస్తుతం సొసైటీలో యూత్ ఎలా ఉన్నారు. అసలు రిలేషన్ షిప్ అంటే ఏమిటి అనేది ఇందులో చూపిస్తాం. మంచి యాక్షన్ తో పాటు సొసైటీకి ఉపయోగపడే మెసేజ్ కూడా ఇందులో ఉంది. ఫ్యామిలీ అంటా తప్పక చూడాల్సిన చిత్రం’ అన్నారు. చక్రి సోదరుడు మహిత్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీకాంత్ రెడ్డి నిర్మించారు.