ఆభారీ చిత్రంలో షారుక్ గెస్ట్ రోల్…?

shahrukh khany

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన కొత్త సినిమా వివరాలు ఇంకా ప్రకటించలేదు. గత ఏడాది ఆయన జీరో అనే ప్రయోగాత్మక చిత్రంలో మరుగుజ్జు పాత్రలో కనిపించారు. ఐతే ఆ మూవీ ఆయనకు నిరాశే మిగిల్చింది. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ మూవీ హిందీ రీమేక్ లో షారుక్ నటించడానికి ఆసక్తి చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. అమితాబ్, రణ్వీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర మూవీలో షారుక్ ఓ క్యామియో పాత్ర చేయనున్నారని తాజా సమాచారం.

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా నిర్మిస్తుండగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇప్పటికే కింగ్ నాగార్జున ఓ పాత్ర చేస్తుండగా…,షారుక్ కూడా జాయిన్ కానున్నారనే వార్త ఆసక్తిని రేపుతోంది. ఐతే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. బ్రహ్మస్త్ర మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశం కలదు.

Exit mobile version