లేటెస్ట్ : రిటైర్మెంట్ పై బాలీవుడ్ బాద్షా ఇంట్రస్టింగ్ కామెంట్స్

Published on Feb 21, 2023 1:00 am IST


బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవల సిద్దార్ధ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ మూవీ ద్వారా అతి పెద్ద విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ ఒక క్యామియో రోల్ చేసిన ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా యష్ రాజ్ ఫిలిమ్స్ వారు దీనిని గ్రాండ్ గా నిర్మించారు. ప్రస్తుతం రూ. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ కి చేరువలో ఉంది పఠాన్. ఆ విధంగా ఈ మూవీ అన్ని ఏరియాల్లో కూడా కలెక్షన్ అదరగొడుతూ దూసుకెళ్తుండడంతో షారుఖ్ ఎంతో ఆనందంలో ఉన్నారు.

ఇక లేటెస్ట్ గా తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఆస్క్ షారుఖ్ పేరుతో ఒక చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ని కొద్దిసేపటి క్రితం ఫ్యాన్స్ తో నిర్వహించారు షారుఖ్. ఈ సందర్భంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు షారుఖ్ సమాధానం ఇచ్చారు. రిటైర్మెంట్ అనంతరం మీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని భావిస్తున్నారు అంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు షారుఖ్ ఈ విధంగా బదులిచ్చారు. నేను నా నటనని ఎప్పటికీ విరమించుకోను, ఒకవేళ ఎవరైనా నన్ను తొలగిస్తే మరింత దృఢంగా తిరిగొస్తా అంటూ షారుఖ్ చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విధంగా తమ అభిమాన కథానాయకుడు తమతో ముచ్చటించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో షారుఖ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :