‘జవాన్’ లో తన రోల్ పై షారుఖ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Sep 5, 2023 8:02 pm IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మూవీ జవాన్. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గౌరి ఖాన్ భారీ వ్యయంతో నిర్మించగా ఇటీవల ఈ మూవీ నుండి అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్స్ అన్ని కూడా సూపర్ గా క్రేజ్ అందుకున్నాయి. అలానే జవాన్ టీజర్, ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకోవడంతో తప్పకుండా అందరి అంచనాలు అందుకుని సెప్టెంబర్ 7న రిలీజ్ కానున్న తమ మూవీ పెద్ద సక్సెస్ సాదిస్తుందని హీరో షారుఖ్ తో పాటు మూవీ టీమ్ మొత్తం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఒక వీడియోలో భాగంగా జవాన్ లో తన రోల్ పై షారుఖ్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఈ మూవీలో మీరు హీరోగా చేస్తున్నారా లేక విలన్ గా చేస్తున్నారా అంటూ ప్రమోషన్స్ లో భాగంగా అడిగిన ప్రశ్నకు షారుక్ ఇలా సమాధానం ఇచ్చారు. నిజానికి తాను జవాన్ లో సమాజం యొక్క మంచి కోసం కొన్ని చెడు పనులు చేసే వ్యక్తి పాత్రలో కనిపిస్తానని, తప్పకుండా తన పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. తన పిల్లలు తనని యాక్షన్ హీరోగా చూడాలని అనుకుంటున్నారని అన్నారు. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన జవాన్ రిలీజ్ తరువాత ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :