లేటెస్ట్ : తెలుగు ఆడియన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన షారుక్ ఖాన్

లేటెస్ట్ : తెలుగు ఆడియన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన షారుక్ ఖాన్

Published on Dec 18, 2022 12:10 AM IST


బాలీవుడ్ దిగ్గజ నటుడు బాద్షా షారుక్ ఖాన్ కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్న విషయం తెలిసిందే. ఇక ఆయన నుండి సినిమా వస్తుంది అంటే చాలు ఇండియా వ్యాప్తంగానే కాక ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ లో కూడా మంచి క్యూరియాసిటీ ఉంటుంది. ఆ విధంగా అందరిలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న షారుక్ ప్రస్తుతం పఠాన్, జవాన్ మూవీస్ చేస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ గా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఫ్యాన్స్ తో కొద్దిపసేపు చాట్ చేసిన షారుక్, ఒకానొక నెటిజన్ తెలుగు ఆడియన్స్ గురించి చెప్పమని అడగగా దానికి ఇంట్రెస్టింగ్ గా కామెంట్ చేసారు షారుక్. తెలుగు ఆడియన్స్ సినిమాలను అమితంగా ఇష్టపతారని, అలానే వారికి మంచి సినిమా పరిజ్ఞానం ఉందని కామెంట్ చేశారు. మొత్తంగా కింగ్ ఖాన్ మన తెలుగు ఆడియన్స్ పై ఈ విధంగా గొప్పగా కామెంట్ చేయడంతో పలువురు ప్రేక్షకాభిమానులు ఆయన పై ప్రసంశలు కురిపిస్తూ సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు