బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతున్న షారుఖ్ ‘పఠాన్’ కలెక్షన్ దూకుడు

Published on Jan 31, 2023 5:11 pm IST


బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిన భారీ మూవీ పఠాన్. సిద్దార్ధ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్ అబ్రహం నెగటివ్ రోల్ చేసారు. ఇక ఇటీవల విడుదలైన పఠాన్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సూపర్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం ఇంకా అనేక ప్రాంతాల్లో కలెక్షన్స్ అదరగొడుతూ దూసుకెళుతోంది.

అటు షారుఖ్ కెరీర్ లోనే గాక ఇటీవల రిలీజ్ అయిన పలు బడా మూవీస్ యొక్క కలెక్షన్ రికార్డులని సైతం బద్దలు కొడుతోంది పఠాన్. ఇక నిన్న సోమవారం ఈ మూవీ రూ. 25.5 కోట్లు నెట్ కలెక్షన్ సొంతం చేసుకోగా మొత్తంగా చూస్తే రూ. 296.5 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టి రూ. 300 కోట్లకి చేరువ అవుతోంది. భారీ యాక్షన్ తో కూడిన థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందిన పఠాన్ మూవీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక క్యామియో పాత్రలో కనిపించగా దీనిని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా అత్యద్భుతమైన విజువల్ వండర్ గా తెరకెక్కించారు దర్శకుడు సిద్దార్ధ ఆనంద్.

సంబంధిత సమాచారం :