సంచలన రికార్డు సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్ ‘పఠాన్’

Published on Jan 26, 2023 2:22 am IST

ప్రముఖ బాలీవుడ్ హీరో బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పఠాన్. మరొక బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నెగటివ్ రోల్ చేసిన ఈ మూవీని యష్ రాజ్ ఫిలిమ్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మించగా సిద్దార్థ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇక అందరిలో మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పరిచిన పఠాన్ మూవీ నేడు గ్రాండ్ లెవెల్లో అత్యధికంగా 8000 స్క్రీన్స్ లో ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకి వచ్చింది.

ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని పలువురు షారుఖ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటూ దూసుకెళ్తోన్న పఠాన్ మూవీని నేటి నుండి అర్ధరాత్రి 12.30 ని. ల స్పెషల్ షో లని కూడా అదనంగా ప్రదర్శించనున్నారు. అయితే యునానిమస్ గా పఠాన్ మూవీ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవోడంతో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ యొక్క డిమాండ్ మేరకు ఈ స్పెషల్ షోలని పఠాన్ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా అదనంగా షో లు ఏర్పాటు చేయడం ఒక పెద్ద రికార్డు అని అంటున్నారు సినీ ట్రేడ్ అనలిస్టులు. మొత్తంగా నాలుగేళ్ళ విరామం తరువాత ఈ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు షారుఖ్.

సంబంధిత సమాచారం :