శర్వానంద్ కొత్త సినిమా షూటింగ్ విశేషాలు !
Published on Nov 16, 2017 2:57 pm IST

శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సుదీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్న ఈ హీరో త్వరలో డైరెక్టర్ హను రాఘవపుడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చెయ్యబోతునట్లు తెలుస్తోంది. హను తాజాగా ‘లై ‘సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. హను, శర్వానంద్ సినిమా డిఫరెంట్ సబ్జెక్టుతో తెరకెక్కనుంది.

ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ చిత్ర బృందం నేపాల్ బయలుదేరుతున్నారు. నేపాల్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ మొదలు కానుంది. ఈ ప్రాజెక్ట్ కు సంభందించి ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook