శర్వానంద్ కొత్త సినిమా రేపే ప్రారంభం !
Published on Nov 22, 2017 10:52 am IST

‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి తాజాగా డైరెక్ట్ చేసిన ‘లై’ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ శర్వానంద్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. రేపే ఈ సినిమా ప్రారంభం కానుంది. కొత్త నిర్మాతలు సుధాకర్ చిరుగుపాటి, ప్రసాద్ చుక్కపల్లి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

‘మహానుబావుడు’ సినిమా తరువాత శర్వానంద్ చెయ్యబోయే సినిమా కావడంతో క్రేజ్ బాగానే ఉంది. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా తరువాత శర్వానంద్ నటీ నటించబోయే క్లీన్ లవ్ స్టోరి ఇదే కావడం విశేషం. సాయి పల్లివి ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీకి సంభందించి ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook