ఫుల్ స్వింగ్ లో శర్వానంద్, రక్షిత రెడ్డి ప్రీ వెడ్డింగ్ వేడుకలు

Published on Jun 2, 2023 11:44 pm IST

యువ నటుడు శర్వానంద్ ఇటీవల టైం ట్రావెల్ మూవీ ఒకే ఒక జీవితం ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. తాజాగా యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో ఆయన ఒక మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక విషయం ఏమిటంటే శర్వానంద్, రక్షిత రెడ్డిని రేపు అనగా (జూన్ 3) న రాజస్థాన్‌లోని జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వివాహం చేసుకోనున్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి పలువురు ప్రముఖ సినీ నటులు మరియు వధూవరుల సన్నిహితులు మరియు బంధువులు ఈ వివాహ వేడుకకి తరలిరానున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.

ఈరోజు ముందుగా కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో హల్దీ వేడుక జరిగింది. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఒక వీడియోలో, హల్దీ నీటిలో తడిసిన శర్వా తన బంధువులు మరియు స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసారు. ఇక ఈరోజు రాత్రి సంగీత్ వేడుక మరియు మెహందీ ఉత్సవాలు జరుగుతాయి. సరిగ్గా రేపు ఉదయం 11 గంటలకు వీరి పెళ్లి జరగనుంది. కాగా శర్వానంద్, రక్షితారెడ్డిల నిశ్చితార్థం జనవరిలో జరిగింది. రక్షితారెడ్డి అమెరికాలో ఐటీ ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తుండగా ఆమె తండ్రి మధుసూధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాది మరియు ఆమె తాత బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి ప్రముఖ రాజకీయ నాయకుడు.

సంబంధిత సమాచారం :