వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా శర్వానంద్

jaanu 1

శర్వానంద్, సమంత జంటగా దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం జాను. తమిళ సూపర్ హిట్ మూవీ 96 కి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. మెడలో కెమెరా, వెనుక బ్యాగ్ తో ఎడారిలో ఉన్న శర్వానంద్ లుక్ కొత్తగా అనిపించింది. కాగా నేడు ఈ చిత్రం నుండి మరో పోస్టర్ విడుదల చేశారు.ఆ పోస్టర్ లో ఓ రాబందుని శ్రద్దగా ఫోటో తీస్తున్నాడు శర్వా. ఈ నేపథ్యంలో శర్వా జాను చిత్రంలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాపర్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. శర్వానంద్ ఇలాంటి రోల్ గతంలో ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవు. దీనితో జాను చిత్రంలో శర్వా పాత్రపై ఆసక్తిరేగుతుంది.

ఇక జాను చిత్రంలో టైటిల్ రోల్ సమంత చేస్తున్నారు. ఆమె పేరు ఏ చిత్రంలో జానని కాగా షార్ట్ లో జాను అని పెట్టారు. తమిళ చిత్రానికి పని చేసిన దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 14న ప్రేమికుల రోజు కానుకగా జాను చిత్రం విడుదల అయ్యే అవకాశం కలదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version