శర్వానంద్ మాస్ అవతార్.. ‘భోగి’ ఫస్ట్ లుక్ కి డేట్, టైం ఫిక్స్

bhogi 1

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో అలరించేందుకు వచ్చి హిట్ అందుకున్న యువ హీరోస్ లో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ కూడా ఒకరు. మరి శర్వానంద్ నుంచి రాబోతున్న తదుపరి చిత్రాల్లో రచ్చ, గౌతమ్ నంద దర్శకుడు సంపత్ నంది నుంచి వస్తున్న భోగి కూడా ఒకటి. మరి ఈ సినిమా కోసం శర్వానంద్ మాస్ అవతార్ లోకి మారగా ఫైనల్ గా ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలకి మేకర్స్ రంగం సిద్ధం చేశారు.

మరి ఈ అవైటెడ్ ఫస్ట్ లుక్ ని ఈ ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటల 14 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి ఇందులో శర్వా ఎలా కనిపిస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు అలాగే అనుపమ, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే శ్రీ సత్యసాయి ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version