‘మహా సముద్రం’కి తన వర్క్ ఫినిష్ చేసేసిన శర్వా.!

Published on Oct 5, 2021 1:30 pm IST

ప్రస్తుత దసరా మహోత్సవంకు టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రెడీగా ఉన్న పలు సాలిడ్ చిత్రాల్లో యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ అలాగే స్టార్ హీరో సిద్ధార్థ్ చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో చేస్తున్న ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా “మహా సముద్రం” కూడా ఒకటి. మంచి అంచనాలు నెలకొల్పుకొని ఉన్న ఈ చిత్రాన్ని ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించారు.

మరి ఈ సినిమాకి గాను శర్వానంద్ తన మొత్తం డబ్బింగ్ ని ఇప్పుడు కంప్లీట్ చేసేసినట్టుగా తెలిపాడు. మొత్తానికి శర్వా తన వర్క్ అంతటినీ కంప్లీట్ చేసేసాడు. దీనితో అయినా మంచి కం బ్యాక్ ఇస్తాడేమో ఇక చూడాలి. ఇక ఈ సినిమాలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని అనీల్ సుంకర నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :