ఓటీటీ లోకి వచ్చేసిన శర్వా ‘నారీ నారీ నడుమ మురారి’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Nari Nari Naduma Murari

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari). ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, క్లీన్ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో భారీ చిత్రాల మధ్య పోటీ ఉన్నప్పటికీ, తనదైన వినోదంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది.

​ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ఈ సినిమా డిజిటల్ అరంగేట్రం చేయడం విశేషం. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమా అందుబాటులో ఉంది.

​ఈ చిత్రంలో సంయుక్త మరియు సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించగా, సునీల్, నరేష్ విజయకృష్ణ, సంపత్ రాజ్ మరియు వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version