ఫోటో మూమెంట్ : మెగా కాంబోతో శర్వా న్యూయర్ వేడుకలు.!

ఫోటో మూమెంట్ : మెగా కాంబోతో శర్వా న్యూయర్ వేడుకలు.!

Published on Jan 1, 2023 9:00 AM IST

ఈ కొత్త ఏడాదితో సినీ వర్గాల్లో కూడా సంబరాలు ఎప్పటిలానే పెద్ద ఎత్తున స్టార్ట్ అయ్యాయి. దీనితో అనేకమంది సినీ ప్రముఖులు అయితే ఆల్రెడీ సోషల్ మీడియాలో తమ అభిమానులతో కొత్త ఏడాది శుభాకాంక్షలు వ్యక్తం చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తుండగా టాలీవుడ్ నుంచి అయితే లేటెస్ట్ గా ఓ యంగ్ హీరో సెలెబ్రేషన్స్ వైరల్ గా మారాయి.

మరి మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ అయితే ఇంటి వద్ద కనిపించి ఈ కొత్త ఏడాది వేడుకలు మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో అయితే కలిసి కనిపించాడు దీనితో ఆనందం వ్యక్తం చేస్తూ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా వారి ఫాలోవర్స్ ఇది చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంట్ గానే శర్వానంద్ ఒకే ఒక జీవితం చిత్రంతో మంచి హిట్ అందుకోగా మెగాస్టార్ మరియు చరణ్ లు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు