వైవిధ్యమైన కథాంశంతో శర్వానంద్ కొత్త సినిమా ?

10th, December 2016 - 01:25:26 PM

sharwand
‘రన్ రాజ్ రన్, ఎక్స్‌ప్రెస్‌రాజా’ వంటి వైవిధ్యమైన చిత్రాల తరువాత యంగ్ హీరో శర్వానంద్ చేస్తున్న తదుపరి చిత్రం ‘శతమానంభవతి’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్నాడు. కుటుంబపరమైన అనుబంధాలకు పెద్ద పీఠ వేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఊస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ సంక్రాంతికి ‘ఖైదీ, శాతకర్ణి’ వంటి బడా సినిమాలతో పోటీ పడేందుకు సిద్దమవుతోంది.

ఇక హీరో శర్వానంద్ తన నెక్స్ట్ సినిమా వైవిధ్యంగా ఉండేలా చూస్తున్నాడట. అందుకే డిఫరెంట్ ఐడియాలతో యూత్ పల్స్ ను బాగా పట్టుకోగలిగే దర్శకుడు మారుతి డైరెక్షన్లో ఓ సినిమా చేయాలని శర్వా యోచిస్తున్నాడట. ఈ సినిమా కథ మొత్తం బ్రాండ్స్ అంటే పడి చచ్చే ఒక కుర్రాడి జీవితంగా ఉండనుందని సమాచారం. మరికి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, మిగతా నటీ నటులెవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.