భారీ బైక్ రేస్ యాక్షన్ కోసం ఇండోనేషియా పయనమైన శర్వా

భారీ బైక్ రేస్ యాక్షన్ కోసం ఇండోనేషియా పయనమైన శర్వా

Published on Feb 13, 2025 10:01 PM IST

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన కెరీర్‌లో 36వ చిత్రంగా ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ రానుంది. ఈ సినిమాను అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండనున్నాయి.

ఈ మూవీ బైక్ రేసు నేపథ్యంలో సాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఈ మూవీలోని ఓ భారీ యాక్షన్ బైక్ రేసు స్టంట్ షూటింగ్ కోసం శర్వానంద్ తాజాగా ఇండోనేషియా పయనమయ్యాడు. ఆయన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపించారు.

ఇక ఈ సినిమాలో అందాల భామ మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు