మరో కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేసిన శర్వానంద్ !


ఈ సంవత్సరం తెలుగు పరిశ్రమ అందుకున్న భారీ విజయాల్లో ‘శతమానంభవతి’ కూడా ఒకటి. ఈ చిత్రం అందించిన విజయంతో హీరో శర్వానంద్ స్థాయి ఒక్కసారిగా మారిపోయింది. కొత్త కొత్త ప్రాజెక్టులు ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన చేసిన ‘రాధ’ సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుండగా మారుతి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాడు. దీంతో పాటే స్టార్ డైరెక్టర్ దశరథ్ సినిమాకి కూడా శర్వానంద్ సైన్ చేసినట్టు సమాచారం.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటరటైనర్ గా ఉండనున్న ఈ స్క్రిప్ట్ ను కొన్నాళ్ల క్రితం దశరథ్ శర్వానంద్ కు వినిపించారని, అది నచ్చడంతో శర్వానంద్ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తవగానే శర్వానంద్ ఈ సినిమాని మొదలుపెడతారని, ఈ ప్రాజెక్టును ఠాగూర్ మధు నిర్మిస్తారని అంటున్నారు. అయితే ఈ విషయంపై శర్వానంద్ నుండి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.