సెన్సార్ పనులు ముగించుకున్న ‘నారీ నారీ నడుమ మురారి’.. శర్వా సినిమాకు ఎన్ని కట్స్ అంటే..?

nari

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో శర్వా ముచ్చటగా మూడోసారి సంక్రాంతి బరిలో తన సినిమాతో రానున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై సాలిడ్ బజ్ క్రియేట్ చేశాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు కూడా ముగిశాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇందులోని కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సింగిల్ కట్ కూడా సెన్సార్ బోర్డు వారు అభ్యంతరం చెప్పలేదని మేకర్స్ గర్వంగా చెబుతున్నారు.

సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 14న సాయంత్రం 5.49 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాను ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version