శర్వానంద్ 35 అనౌన్స్ మెంట్ వీడియో : స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన శర్వా

Published on Mar 6, 2023 5:06 pm IST

ఇటీవల ఒకేఒక జీవితం మూవీతో హీరోగా మంచి విజయం సొంతం చేసుకున్నారు వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్. ఇక కెరీర్ పరంగా ఎక్కువగా విభిన్నమైన కథ, కథనాలు గల స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ దూసుకెళ్తున్న శర్వానంద్, తాజాగా తన కెరీర్ 35వ మూవీని యువ దర్శకడు శ్రీరామ్ ఆదిత్య తో చేయనున్నారు.

నేడు శర్వానంద్ బర్త్ డే సందర్భంగా కొద్దిసేపటి క్రితం మూవీ అనౌన్స్ మెంట్ వీడియోని రిలీజ్ చేసారు మేకర్స్. లేటెస్ట్ ట్రెండీ స్టైలిష్ లుక్ లో శర్వానంద్ అదరగొట్టిన ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ అందుకుంటోంది. పీపుల్స్ మీడియా ఫాక్టరీ బ్యానర్ పై రూపొందనున్న ఈ మూవీకి హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తుండగా విష్ణు శర్మ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీకి సంబందించిన మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :