సంక్రాతి సెంటిమెంట్ ను దసరాకు రిపీట్ చేయాలనుకుంటున్న యంగ్ హీరో !
Published on Sep 11, 2017 5:31 pm IST


యంగ్ హీరో శర్వానంద్ వరుస సక్సెస్ లను ఎంజాయ్ చేస్తూనే చాల జాగ్రత్తగా స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నాడు. ఆలా అయన ఎంచుకున్న వాటిలో ‘మహానుభావుడు’ కూడా ఒకటి. పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పట్ల ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ క్రేజ్ నెలకొని ఉంది. యూత్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు మారుతి రూపొందించిన ఈ చిత్రం నానికి ‘భలే భలే మగాడివోయ్’ ఏ స్థాయి విజయాన్ని ఇచ్చిందో అదే స్థాయి విజయాన్ని సర్వేకు అంస్తుందని టాక్.

ఇకపోతే ఈ చిత్రాన్ని ఈ నెల్ 29న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ 27న మహేష్ యొక్క భారీ బడ్జెట్ చిత్రం ‘స్పైడర్’ వస్తోంది అంతేగాక అంతకు వారం ముందుగా 21న ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ విడుదలకానుంది. ఇంత భారీ పోటీ నడుమ కొద్దిపాటి గ్యాప్ లోనే రిలీజ్ చేసి రిస్క్ అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతుండగా ఈ ఏడాది ఆరంభంలో చిరు రీ ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం 150’, బాలయ్య 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి భారీ సినిమాల నడుమ ‘శతమానంభవతి’ తో వచ్చి కెరీర్లోనే అత్యంత పెద్ద విజయాన్ని అందుకోలేదా ఈసారి కూడా అలానే జరగొచ్చు అనే సమాధానాలు వినిపిస్తున్నాయి.

నిజమే కంటెంట్ ఉండి, అందులో బలముంటే ఎంత పోటీ అయినా నిలబడొచ్చు. పైగా యూవీ బ్యానర్, దర్శకత్వం మారుతి కనుక ఔట్ ఫుట్ ను మంచి స్థాయిలోనే ఊహించవచ్చు. మరి శర్వా ఈ ‘మహానుభావుడు’ తో రాబోయే దసరాకు పోయిన సంక్రాంతి సెంటిమెంట్ ను ఆపాదిస్తాడో లేదో చూడాలి.

 
Like us on Facebook