శర్వానంద్ “ఒకే ఒక జీవితం” టీజర్ పై లేటెస్ట్ అప్డేట్!

Published on Dec 26, 2021 4:35 pm IST


శర్వానంద్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్ గా శ్రీ కార్తీక్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఒకే ఒక జీవితం. అమల అక్కినేని కీలక పాత్ర లో నటిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ప్రభు ఎస్ ఆర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

అయితే ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ పై తాజాగా చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేయడం జరిగింది. టీజర్ కి సంబందించిన వివరాలను రేపు ప్రకటించనున్నట్లు ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. టీజర్ రిలీజ్ పై రేపు ఒక క్లారిటీ రానుంది. చిత్ర యూనిట్ చేసిన సరికొత్త ప్రకటన తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రాఫర్ గా, శ్రీజిత్ సరంగ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంగీతం జెక్స్ బెజాయి అందిస్తుండగా, ఈ చిత్రం తెలుగు తో పాటుగా తమిళ భాషలో కూడా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :