దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న ‘జార్జ్ క్రిష్’ సినిమా పై కొత్త అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ గత శుక్రవారం నుంచి స్టార్ట్ అయింది. తాజాగా ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ కోసం శ్రీను వైట్ల ప్లాన్ చేస్తున్నాడు. వరుసగా 30 రోజుల పాటు ఘాట్ జరగనుంది. సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ గా వర్క్ ప్లాన్ చేశారట. అందుకు తగ్గట్టుగా శర్వానంద్ కూడా డేట్స్ ఇస్తున్నారట. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
కాగా గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. ఈ క్రమంలోనే శర్వాతో సినిమా చేస్తున్నాడు. కాగా తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది.
