‘శతమానం భవతి’ ఫస్ట్‌డే కలెక్షన్స్!

shatamanam-bhavathi
డిఫరెంట్ కమర్షియల్ సినిమాలతో మెప్పిస్తూ ఉండే హీరో శర్వానంద్, తాజాగా ‘శతమానం భవతి’ అన్న సినిమాతో సంక్రాంతి కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లాంటి రెండు భారీ సినిమాల మధ్యన వచ్చినా కూడా ఈ సినిమా మొదటిరోజు అంచనాలను దాటేసి అన్నిచోట్లా హౌస్‌ఫుల్ వసూళ్ళు రాబట్టడం విశేషంగా చెప్పుకోవాలి.

ఈ స్థాయి భారీ పోటీలోనూ మొదటిరోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 3 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక నేడు కూడా సెలవు దినం కావడంతో కలెక్షన్స్ ఇదే స్థాయిలో ఉంటాయని ఆశిస్తున్నారు. సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మంచి టాక్‌నే తెచ్చుకుంది.

ఇక ప్రాంతాల వారీగా దిల్‌రాజు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రాంతం
కలెక్షన్స్ (షేర్-రూపాయల్లో)
నైజాం 1.05 కోట్లు
సీడెడ్
 35 లక్షలు
ఉత్తరాంధ్ర
 46 లక్షలు
పశ్చిమ గోదావరి
 31.15 లక్షలు
తూర్పు గోదావరి
 39.18 లక్షలు
కృష్ణా
 16.05 లక్షలు
గుంటూరు
 23.08 లక్షలు
నెల్లూరు
08.08 లక్షలు
మొత్తం
3.03 కోట్లు