బాక్సాఫీస్ వద్ద కష్టపడుతున్న “షెహజాదా”

Published on Feb 19, 2023 5:00 pm IST

కార్తీక్ ఆర్యన్ యొక్క తాజా చిత్రం షెహజాదా బాక్సాఫీస్ వద్ద ఊహించిన రీతిలో వసూళ్లను రాబట్టడం లో విఫలం అయ్యింది. మొదటి రోజు ఈ సినిమా కేవలం 6 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, షెహజాదా తెలుగు బ్లాక్‌బస్టర్ అల వైకుంఠపురములో అధికారిక హిందీ రీమేక్. రెండవ రోజు కూడా అదే స్థాయిలో సినిమా వసూళ్లు రాబట్టింది.

ఈ చిత్రం రెండవ రోజు కేవలం 6.65 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండు రోజుల మొత్తం 12.65 కోట్ల రూపాయలకి చేరుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ వీకెండ్‌లో కాస్త వసూళ్లు వచ్చినా, మొత్తానికి ఫ్యాన్స్ కు నిరాశ మిగిల్చింది. కార్తీక్ ఆర్యన్ సరసన కృతి సనన్ కథానాయికగా నటించింది. పరేష్ రావల్, మనీషా కొయిరాలా, సచిన్ ఖేడేకర్, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. టి సిరీస్ ఫిల్మ్స్, అల్లు ఎంటర్టైన్‌మెంట్, బ్రాట్ ఫిల్మ్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కి రోహిత్ ధావన్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :