రెడీగా ఉండండి.. రాజశేఖర్ “శేఖర్” గ్లింప్స్ వచ్చేస్తుంది..!

Published on Nov 25, 2021 2:38 am IST

సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా లలిత్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్టైన ఒక క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా ఈ మూవీ రాబోతుంది. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని ఎంఎల్వీ సత్య నారాయణ, శివాని శివాత్మిక, వెంకట శ్రీనివాస బొగ్గరంలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా నుంచి రేపు సాయంత్రం 05:04 నిమిషాలకు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో అను సితార, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోయే ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, మల్లికార్జున నారగని సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :