రాజశేఖర్ “శేఖర్” ఫస్ట్ సింగిల్ “లవ్ గంటే మోగిందంట” రిలీజ్..!

Published on Jan 5, 2022 8:33 pm IST

సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం “శేఖర్”. మలయాళంలో సూపర్ హిట్టైన క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘జోసెఫ్‌’కు ఇది రీమేక్‌. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆత్మీయ రజన్, ముస్కాన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మొదటి పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.

“ఒరేయ్ నీ లవ్ స్టోరీ ఒకటి చెప్పురా” అనే వాయిస్ ఓవర్ తో పాట మొదలవుతుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనూప్ రూబెన్స్ ఇచ్చిన క్యాచీ ట్యూన్‌కి చంద్రబోస్ గారి సాహిత్యంతో ప్రేమ కథని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పాటని విజయ్ ప్రకాష్, అనూప్, రేవంత్ సంయుక్తంగా ఆలపించారు. “లవ్ గంటే మోగిందంట” అంటూ సాగే ఈ పాట యొక్క లిరికల్ వీడియోలో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో రాజశేఖర్ ఆహార్యం ఆయన గత సినిమాలకు భిన్నంగా ఉంది. మల్లికార్జున్ నరగని కెమెరా విజువల్స్ ఫ్రెష్ ఫీల్స్ ఇస్తున్నాయి.

ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫ‌స్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి పెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ సింగల్ కూడా అదే స్థాయిలో అలరిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :