శేఖర్ ఫస్ట్ సింగిల్ “లవ్ గంటే”కి ముహూర్తం ఫిక్స్..!

Published on Jan 3, 2022 11:45 pm IST

సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా లలిత్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “శేఖర్”. మలయాళంలో సూపర్ హిట్టైన క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘జోసెఫ్‌’కు ఇది రీమేక్‌. బొగ్గరం వెంకట శ్రీనివాస్‌, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆత్మీయ రజన్, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే “ఆర్ఆర్ఆర్’ సినిమా వాయిదా పడటంతో ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ “లవ్ గంటే” రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జనవరి 5వ తేది సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఫస్ట్ సింగిల్‌తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్‌ని కూడా మేకర్స్ ఏమైనా అనౌన్స్ చేస్తారో చూడాలి మరీ. ఇకపోతే ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, మల్లికార్జున నారగని సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :