ధనుష్‌తో శేఖర్ కమ్ముల అలా ప్లాన్ చేశాడా?

Published on Sep 21, 2021 12:38 am IST


టాలీవుడ్‌లో క్లాసిక్‌ ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ధనుష్‌తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే నాగచైతన్య, సాయిపల్లవితో శేఖర్ కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ ఈ నెల 24న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన శేఖర్ కమ్ముల ధనుష్‌తో చేయబోయే సినిమా గురుంచి కూడా మాట్లాడాడు.

అయితే ధనుష్‌తో తీయబోతున్న సినిమా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించబోతున్నట్టు స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలవుతుందని తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :