శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్ మూవీ ఆ వీక్ లోనే!


ఉదయాన్నే ఓ మంచి కాఫీ మనిషికి ఎంతటి హాయిని ఇస్తుందో శేఖర్ కమ్ముల సినిమాలు కూడా అంతే హాయిని ఇస్తాయి. ఆనంద్ సినిమాతో ఆ రుచిని చూపించిన ఈ దర్శకుడు హ్యాపీ డేస్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తన చిత్రంలో పెద్ద స్టార్స్ లేకపోయినా తన దర్శకత్వ ప్రతిభతో ఆడియెన్స్ ని ఆకట్టుకోన గలిగే వ్యక్తి. అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల ఓ అగ్ర హీరో మరియు ఓ ప్రముఖ నిర్మాతతో సినిమాను తీస్తున్న విషయం అందరికి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా , దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఫిదా చిత్రన్నీ శేఖర్ కమ్ముల తనదైన శైలిలో డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండాగా.. వర్షా కాలంలో సినిమాను కూల్ గా రిలీజ్ చెయ్యాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.ఒక అమెరికా అబ్బాయికి, తెలంగాణ అమ్మాయికి మధ్య సాగే ప్రేమ కథ ‘ఫిదా’. ప్రస్తుతం చిత్ర యూనిట్ కొన్ని పాటలను తెరకెక్కించే పనిలో బిజీగా ఉంది. ఆ తరువాత నిదానంగా డబ్బింగ్ ను కూడా పూర్తి చేసి జులై 3 వారంలో పక్కాగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన మలయాళ ‘ప్రేమమ్‌’ ఫేమ్‌ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.